Sunday, August 17, 2025

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగా.. ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలి: జూపల్లి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పెన్‌గంగా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ముంపు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలపై ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షలు జరిపారు. అధికారులతో మంత్రి జూపల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జూపల్లి ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్, హెల్త్ అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో నీట మునగడంతో భారీ ఎత్తున పంట నష్టం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News