Sunday, August 17, 2025

ఆఖరి వన్డేలో ఓటమి.. అయినా సిరీస్ భారత్‌దే..

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో టీం ఇండియా ఎ మహిళల జట్టు (India A Women) ఓటమిపాలైంది. అయినప్పటికీ.. తొలి రెండు మ్యాచ్‌లు గెలవడంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలింగ్ ముందు తడబడింది. ఓపెనర్ షెఫాలి వర్మ(52), యస్తికా భాటియా (42) రాణించినా… మిగితా వాళ్లు భారీ స్కోర్ సాధించడంలో విఫమయ్యారు. ఐదుగురు మాత్రమే రెండంకెల స్కోర్ దాటగా.. ఇతరులు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 47.4 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆ తర్వాత ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా చేధించింది. కీప్ అలెసా హేలీ (84 బంతుల్లో 137 నాటౌట్) అద్భుతమైన శతకతం విరుచుకుపడింది. ఆమెకు తలాయా విల్సన్ 59 తోడుగా నిలిచింది. విల్సన్ ఔట్ అయినప్పటికీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రషెల్ ట్రెనామన్‌(21 నాటౌట్) జట్టుకు విజయం అందించడంటో తన వంతు కృషి చేసింది. దీంతో ఆస్ట్రేలియా 27.5 ఎవర్లలోనే 222 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ (India A Women) 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అందుకు ముందు జరిగిన టి-20 సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ వైట్ వాష్ చేసింది. అందుకు వన్డే సిరీస్‌లో భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News