Sunday, August 17, 2025

తారక్‌ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆపై క్షమాపణ

- Advertisement -
- Advertisement -

అనంతపురం అర్భన్ టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ప్రముఖ హీరో జూ.ఎన్టిఆర్‌ను (Jr.NTR) ఆయన బూతులు తిడుతున్న ఆడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. జూ.ఎన్టిఆర్ నటించిన వార్-2 సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ సదరు ఆడియోలో ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో విన్న జూ.ఎన్టిఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. పోలీసులు వారిని అదుపు చేశారు.

అయితే దీనిపై ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు. ఆ ఆడియో రికార్డు తనది కాదు అని ఆయన అన్నారు. లోకల్ రాజకీయాల్లో భాగంగా తనపై గిట్టని వాళ్లు చేసిన పని ఇది అని పేర్కొన్నారు. తనకు చిన్నప్పటి నుంచి నారా, నందమూరి ఫ్యామిలీలపై చాలా అభిమనం ఉందని తెలిపారు. ఎన్టిఆర్ అభిమానులు బాధపడి ఉంటే క్షమాపణలు అడుగుతున్నాను అని స్ఫష్టం చేశారు.

అయినప్పటికీ ఫ్యాన్స్ (Jr.NTR) ఆందోళన విరమించలేదు. నందమూరి ఫ్యాన్స్ లేనిదే టిడిపి లేదని అన్నారు. ఫ్యాన్స్ కన్నెర్ర చేస్తే టిడిపి ఉండదు అని.. వీళ్లను మేమే ఓట్లేసి గెలిపించామని మండిపడ్డారు. తమకు నాలుగు గోడల మధ్య చెప్పే క్షమాపణ అవసరం లేదని.. బహిరంగా ఎమ్మెల్యే అందరి ముందు క్షమాపణ చెబితేనే ఆందోళనను విరమిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News