బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టివిలో నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా.. ఓ స్టార్ హీరోగా ఎదుగారు. అయితే సాధారణంగా హీరోల కుమారుడు కూడా హీరో అవ్వాలని భావిస్తారు. కానీ, షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) మాత్రం అందుకు భిన్నమైన వృత్తిని ఎంచుకున్నాడు. ఆర్యన్ ఖాన్ త్వరలో దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఆతడు రచించి దర్శకత్వం వహించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే షో త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోని ఆదివారం విడుదల చేశారు. ఈ వీడియోలో తన షో గురించి ఆర్యన తనదైన స్టైల్‌లో వివరించాడు. ఈ షోలో కామెడీ, లవ్, డ్రామాతో పాటు మంచి యాక్షన్ కూడా ఉంటుందని వీడియో చూస్తే మనకు అర్థం అవుతోంది. ఈ షో.. ఆగస్టు 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. మరి షారుక్ కుమారుడు ఆర్యన్ (Aryan Khan) దర్శకుడిగా ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.