టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టి-20, టెస్ట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అతడు 2027లో జరిగే ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అనుకుంటున్నారు. ప్రపంచకప్‌కి ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. 37 ఏళ్ల రోహిత్ అప్పటివరకూ ఫిట్‌గా ఉంటాడా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. త్వరలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్ ఫిట్‌నెస్‌కి పరీక్ష కానుంది. ఈ సిరీస్‌లో రోహిత్ తన ఫిట్‌నెస్‌ని నిరూపించుకోకపోతే.. ఇక జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ రోహిత్‌కి ఓ సలహా ఇచ్చారు.
‘‘రోహిత్ శర్మ (Rohit Sharma) సత్తాపై నాకు అనుమానాలు లేవు. బయట అతనిపై మాట్లాడేదంతా చెత్త్. నేను ఎప్పుడైనా రోహిత్‌ని అభిమానిస్తాను. అతడి బ్యాటింగ్ ఒక వైపు.. మిగితా వాళ్ల బ్యాటింగ్ ఒకవైపు. మీరు (ఫ్యాన్స్‌ని) రోహిత్‌ని ఇంకొంతకాలం ఉండేలా ఒత్తిడి తేవాలి. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టమనండి. రోజుకి 10 కి.మీ.లు పరిగెత్తమనండి. అలా చేస్తే.. 45 ఏళ్లు వచ్చే వరకూ రోహిత్ క్రికెట్ ఆడేందుకు వీలుంటుంది’’ అని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు.