Monday, August 18, 2025

కారులో ఇరుక్కుపోయిన చిన్నారి.. సెల్‌ఫోన్ సాయంతో ప్రాణాలు కాపాడారు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: చిన్నారులు లాక్ చేసిన కారులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే జరిగాయి. తల్లిదండ్రుల ఏమరపాటు వల్లనో లేక చిన్నారులు ఆడుకుంటూ కారు ఎక్కి లాక్ చేయడం వల్లనో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటాయి. కారులో లాక్ చేసిన చిన్నారిని ఎలా బయటకు తీయాలో ఆ సందర్భంలో ఐడియా రాక చివరకు అది ఆ పసి ప్రాణాలు బలవుతుంటాయి. కానీ, ఓ యువకుడు మాత్రం చాలా చాకచక్యంతో వ్యవహరించి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. (Peddapalli)

పెద్దపల్లి (Peddapalli) జిల్లాలోని సుల్తానాబాద్‌లో తమ కారులో ఓ కుటుంబం ఒక స్వీట్ షాప్‌కి వెళ్లింది. కీస్‌ని లోపలే వదిలేయడంతో పాటు.. కారులోనే చిన్నారిని కూడా ఫ్యామిలీ వదిలి వెళ్లారు. దీంతో డోర్ లాక్ కావడంతో కారులోనే చిన్నారి చిక్కుకుపోయింది.. డోర్ తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం రాలేదు. చివరకు ఓ యువకుడు అప్పుడే ఓ యువకుడు వచ్చి.. డోర్ ఎలా ఓపెన్ చేయాలో సెల్‌ఫోన్‌లో చూపించాడు. ఆ వీడియో చూసి.. చాకచక్యంగా డోర్ ఓపెన్ చేసిన చిన్నారి.. క్షేమంగా బయటకు వచ్చింది. సమయస్ఫూర్తితో చిన్నారిని కాపాడిన యువకుడిని స్థానికులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News