Monday, August 18, 2025

విషాదం నింపిన సరదా

- Advertisement -
- Advertisement -

సరదా కోసం జలపాతాన్ని చూద్దామని వెళ్లిన మిత్రుని మృతితో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మిరియాలపెంట దగ్గర దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ఏడుబావుల జలపాతం మరోసారి ఒక ప్రాణాల్ని బలి తీసుకుంది. శనివారం స్నేహితులతో ఏడు బావుల జలపాతానికి వచ్చి గల్లంతైన తోటి స్నేహితుడు ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం గ్రామానికి చెందిన పామర్తి ప్రేమ్‌కుమార్ (25) యువకులతో ఈ జలపాతం సందర్శనకు వచ్చారు. అయితే వారిలో ప్రేమ్‌కుమార్ జలపాతంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే గంగారం ఎస్సై రవికుమార్ స్థానిక పోలీసులతో కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. దట్టమైన అటవీ కావడంతో రక్షణ చర్యలకు ఆటంకం కలిగినా ఆదివారం ఉదయం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా ఏడుబావుల జలపాతంలో ప్రతీ బావిలో వెతకగా ఒక బావిలో ప్రేమ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు.

కాగా గత నెలలోనే పోలీసుల ఆధ్వర్యంలో జలపాతం వద్ద ప్రమాదకర పరిస్థితులను పోలీసు వారు హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటుచేసినా పర్యాటకులు నిర్లక్షం వహిస్తూ వస్తుండటంతో ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. జలపాతం వద్దకు ఎవరూ రావద్దని ఎస్సై విజ్ఞప్తి చేశారు. ప్రేమ్‌కుమార్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఏడుబావుల జలపాతంలో ప్రేమ్‌కుమార్ కొట్టుకపోయి మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మొదటి కుమారుడు రెండేళ్ల క్రితం ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతిచెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News