Monday, August 18, 2025

భారత్-పాక్ మ్యాచ్‌కి క్రేజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న సోనీ

- Advertisement -
- Advertisement -

క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే అభిమానులు అన్ని పనులు మానుకొని టివిలకు అతుకుపోతారు. ఇక స్టేడియంలు అయితే అభిమానులతో కిక్కిరిపోతాయి. అయితే ఈ రెండు జట్లు ఐసిసి, ఎసిసి ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతాయనే విషయం తెలిసిందే. త్వరలో ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఆ మ్యాచ్‌కి క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది.

అయితే ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకునే పనిలో పడింది సోని పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక ప్రకారం ఆసియాకప్‌లో (Asia Cup 2025) భారత్ ఆడే మ్యాచ్‌లలో ప్రకటన కోసం 10 సెకన్లకు రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ డబ్బు చెల్లించాలని సోని నెట్‌వర్క్ నిర్ణయం తీసుకుంటదని తెలుస్తోంది. ఇక భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌కి కూడా ఈ రేట్లే వర్తిస్తాయని సమాచారం. 2031 వరకూ ఆసియాకప్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా 170 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో వెయ్యి కోట్లకు పైగా)కు సొంతం చేసుకుంది. ఇక ఆసియాకప్ మ్యాచ్‌లు సోని స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోని లివ్ యాప్‌లో ప్రసారం కానున్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ తలపడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News