Monday, August 18, 2025

న్యూయార్క్ సిటీలో కాల్పుల కలకలం..ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ సిటీలోని క్రౌన్ హైట్స్ రెస్టారెంట్ లోకి ఆదివారం తెల్లవారు జామున దుసుకువచ్చిన దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో ముగ్గురు చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 903 ఫ్రాంక్లిన్ అవెన్యూలోని టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్ లోపల ఈ కాల్పుల ఘటన జరిగింది. న్యూయార్క్ పోలీసు శాఖ కమిషన్ జెస్సికా టిష్ విలేకరులకు వివరాలు తెలిపారు. బాధితులలో ముగ్గురు మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారని ఆయన అన్నారు. మృతులలో ఇద్దరు పురుషులు. గాయపడిన 8 మందిని సమీప ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. న్యూయార్క్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినా, ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్
చేయలేదు. కాల్పులకు పాల్పడిన దుండగులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో 36 షెల్ కేసింగ్ లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News