Monday, August 18, 2025

రుజువులు చూపాలి లేదా క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటుచోరీపై దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన ప ట్ల ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పం దించింది. ఓటు చోరీపై ఎన్నికల కమిషన్ కు అన్నిరుజువులతో ఏడురోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని లేదా బహిరంగ క్షణాపణ చెప్పాలని ప్రధాన ఎ న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గడువు విధించారు. రుజువులతో అఫిడవిట్ సమర్పించలేని పక్షంలో ఆ ఆరోపణలు అ న్నీ అవాస్తవాలని భావించవలసి వస్తుందని ఈసీఐ పేర్కొన్నా రు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారంనాడు మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఓట్ల చోరీపై రుజువులతో కూడిన అఫిడవిట్ సమర్పించాలి లేదా దేశానికి క్షమాపణ చేప్పాలి.

మరో అవకాశం లేదు. 7 రోజులలోగా అఫిడవిట్ అందని పక్షంలో ఆ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవిగా అర్థం చేసుకోవల్సివస్తుందని ఈసీఐ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే అని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఓటు చోరీ వంటి పదాలు ప్రజాస్వామ సంస్థలను బలహీన పరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు, రాజకీయ లబ్ధి కోసం ఓటర్లను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రతిపక్షనేత ఎన్నికల కమిషన్ ను వేదికగా ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నే లక్ష్యంగా పెట్టుకుని భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ విషయాన్ని దేశ ప్రజలకు స్పష్టం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ పేదలు, ధనికులు, వృద్ధులు, యువకులు, మహిళలు అన్న తేడా లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా కృషి చేస్తున్నదని, ఇక ముందు కూడా అదే లక్ష్యంతో సాగుతుందని జ్ఞానేష్ కుమార్ స్పష్టంచేశారు. ఒకరే రెండు, మూడు ఓట్లు వేస్తున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ, కొంతమంది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎటువంటి రుజువులు లభించలేదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం కానీ, భారతీయ ఓటర్లు కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలకు భయపడబోరని ఈసిఐ స్పష్టం చేశారు.

పార్టీలపై వివక్ష లేదు
దుష్ప్రచారానికి దిగుతున్నాయని ఎన్నికల ప్రధానాధికారి (సిఇసి) జానేశ్ కుమార్ విమర్శించారు. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్)ను ఆయన పూర్తి స్థాయిలో సమర్థించారు. ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఇసి భుజాలపై తుపాకీ పెట్టి కాల్చడం దారుణం అని ఆయన స్పందించారు. సర్, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విపక్షాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ దశలో ఎన్నికల సంఘం అసాధారణ రీతిలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్‌ను కేంద్రీకృతం చేసుకుని ప్రతిపక్షాలు సాగిస్తున్న ఓట్లచోరీ వాదన నిరాధారం అని జ్ఞానేశ్ కుమార్ ఎదురుదాడికి దిగారు. ఓట్లు రెండింతలు అయ్యాయని, బోగస్ ఓట్లు వచ్చిచేరాయని చెప్పడం తప్పని అన్నారు. సర్ ప్రక్రియను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాలు పారదర్శకతతో పనిచేస్తున్నాయని వివరించారు. ఇండియా కూటమి తరఫున రాహుల్ సారధ్యలో బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ఆరంభించిన దశలోనే ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. బీహార్‌లోనే కాకుండా ఎక్కడైనా ఎన్నికల సంఘం ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల సవరణ చేపట్టడం, సంబంధిత పక్షాలకు అభ్యంతరాలు సమ్మతి గురించి తెలియచేయడం ఆనవాయితీ అని సిఇసి తెలిపారు.

డబుల్ ఓటింగ్, ఓట్ల చోరీ కోసమే హడావిడిగా సర్ ప్రక్రియకు దిగారనే వాదన బూటకమన్నారు. హవావిడి ప్రక్రియ అనడం మిథ్య అని స్పందించారు. కొన్ని పార్టీల తీరు పరమ దారుణంగా ఉందని అన్నారు. అభ్యంతరాలను తెలియచేయడానికి ఇప్పటికీ 15 రోజుల గడువు ఉంది. దీనిని గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే దిశలో కమిషన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు కలిసి అంతా సవ్యంగా సాగేలా చేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తమకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటే. ఇందులో వివక్షత లేదని, ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా తమకు ఉండదని స్పష్టం చేశారు. పైగా అభ్యంతరాలు ఉంటే తెలియచేస్తూ 45 రోజుల గడువులోగా పార్టీలు ముందుకు రాకపోవడం, మరో వైపు ఓట్లచోరీ జరిగిందని ఆరోపించడం దేశ రాజ్యాంగాన్ని అవమానించినట్లే అవుతుందని చెప్పారు. నిరాధార ఆరోపణలకు , ఏదో జరిగిందనే దుష్ప్రచారానికి ఎన్నికల సంఘం భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము ఓటర్లనే పట్టించుకుంటామని, అనుచిత రాజకీయ దుష్ప్రచారం గురించి ఆందోళన చెందేది లేదని సిఇసి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News