Monday, August 18, 2025

23న పిఎసి భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: రిజర్వేషన్లపై వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే అంశంపై చర్చించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం (పిఏసి) సమావేశం ఈ నెల 23న నిర్వహించాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ నిర్ణయించారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహేష్ కుమార్ గౌత్, రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసి నాయకు డు, మాజీ ఎంపి హనుమంతరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాలపై చర్చించినప్పటికీ ప్రధానంగా బిసి రిజర్షేషన్లపైనే చర్చించారని తెలిసింది. బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వా తే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని గతంలో సిఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే రిజర్వేషన్ల విషయంలో కేంద్రం తేల్చేంత వరకూ ఆగలేమని, సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన విషయంపైనా వారు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే మళ్లీ కోర్టులో పిటిషన్లు దాఖలవుతాయని వారు భావించారు.
కాగా 23వ తేదీన పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సమావేశాన్ని నిర్వహించి చర్చిద్దామని వారు నిర్ణయించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే పక్కా ప్రణాళికతో ముందుకెళదామని వారు నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం.

బిఆర్‌ఎస్‌లో నాలుగు ముక్కలాట..
మహేష్ కుమార్ గౌడ్ విమర్శ
సమావేశానంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌లో నాలుగు ముక్కలాట కొనసాగుతున్నదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తనయుడు కె. తారక రామారావుకు, కుమార్తె కవితకు మధ్య విభేదాలు ఉన్నాయని, దీంతో మాజీ మంత్రి టి. హరీష్ రావు పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇవన్నీ చూసి కెసిఆర్ ఫాం హౌస్‌కే పరిమితం అయ్యారని ఆయన చెప్పారు.
కవితను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
మరి కొందరు ఎమ్మెల్యేలు..
కాంగ్రెస్‌లో చేరేందుకు మరి కొంత మంది ఎమ్మెల్యేలు ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలిపారు. వారి పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ఇది బిఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ కలిగిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News