న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవి ఎన్నికకు ఎన్‌డిఎ అభ్యర్థిగా మహారాష్ట్ర గ వర్నర్ సిపి.రాధాకృష్ణన్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బిజెపి వర్గా లు ఆదివారం రాత్రి ప్ర కటించాయి. ఎన్‌డిఎ అభ్యర్థి ఎవరవుతారనే అంశంపై నెలరోజులు గా తీవ్ర ఉత్కంఠ నెలకొ ని ఉంది. ఆదివారం బి జెపి పార్లమెంటరీ పా ర్టీ సమావేశంలో సిపి రాధాకృష్ణన్ ఈ పదవికి అభ్యర్థిగా ఎంపిక చే సినట్లు, ఆయన ఎన్‌డిఎ తర ఫు అభ్యర్థి అవుతారని సమావేశం తరువాత బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. ఇప్పటికే ఎన్డిఎలో మిత్రపక్షాల నుంచి ఉప రాష్ట్రపతి పదవికి అభ్య ర్థి ఎంపిక నిర్ణయాధికారం బిజెపికి వదిలిపెట్టిన దశలో, ఇప్పుడు బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు. రెండుసార్లు ఎంపి అయ్యా రు. ఇక సిపి రాధాకృష్ణన్ పేరు ఖరారు కావడంతో మంగళవారం ఎన్‌డిఎ పార్లమెంట రీ పార్టీ సమావేశానికి పిలుపు నిచ్చారు.
ఆ రోజున సిపి కూడా హాజరవుతారు. ఎన్‌డిఎ మిత్రపక్షాల నాయకులు కూడా వస్తారని వెల్లడైంది. సిపినే ఈ పదవికి ఎంపిక అవుతారని ముంబైలో ఉదయమే సంకేతాలు వెలువడ్డాయి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయానికి వె ళ్లి పూజాదికాలు నిర్వహించారు. ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం ఎంపి సంజయ్ రౌత్ తరఫున కూడా అభినందనలు వెలువడ్డాయి. రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బిజెపి తరఫున ఎంపిగా గెలుపొందడం విశేష పరిణామం. ఆయన గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ గవర్నర్‌గానూ, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అతి కొద్ది కాలమే . చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ (సిపి రాధాకృష్ణన్ ) 1957 అక్టోబర్ 20న అప్పటి మద్రాసు స్టేట్ ఇప్పుడు తమిళనాడు
రాష్ట్రంలోని తిరుపూర్‌లో జన్మించారు.
ఆయన వయస్సు 67 సంవత్సరాలు. ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. ఇంతకు ముందటి లాగా కాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు , బిజెపి అగ్రనాయకత్వానికి అత్యంత విధేయతతో ఉండే వ్యక్తికి ,అందులోనూ గవర్నర్‌గా అనుభవం ఉండే వివాదరహితులకు ఈ కీలక స్థానం కల్పించాలని పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే పలు పేర్ల వడబోతల తరువాత ఈ గవర్నర్‌ను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారని బిజెపి వర్గాలు తెలిపాయి. పోటీకి తమ అభ్యర్థిని దింపుతామని సరైన మెజార్టీ లేకపోయినా ప్రతిపక్షాలు తెలిపాయి. అయితే ఇప్పటివరకూ సంబంధిత విషయంపై ఎటువంటి సంప్రదింపులు జరగలేదు. కాగా ఈ నెల 21తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. విధేయతకు పెద్ద పీట క్రమంలోనే సిపికి ఈ స్థానం దక్కిందని వెల్లడైంది. ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక అయిన సిపి రాధాకృష్ణన్‌కు ప్రధాని మోడీ ఇతర నేతలు అభినందనలు తెలిపారు. ఆయన చిరకాల ప్రజా జీవితం, పరిపాలనా దక్షత, అంకితభావం, మేధాశక్తి ఇవన్నీ ఆయనకు మరింత గౌరవాన్ని ఆపాదించాయని ప్రధాని కితాబు వెలువరించారు.