కైఫ్ ఆసియా కప్ జట్టు ఇదే
ముంబై: వచ్చే నెలలో ఆసియా కప్ టి20 మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం భారత జట్టును త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నీలో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా, టెస్ట్ క్రికెట్లో కెప్టెన్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న శుభ్మన్ గిల్‌కు టి20 జట్టులో మళ్లీ అవకాశం లభిస్తుందా సందేహాలు ఉన్నాయి. అలాగే కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటిసీనియర్ ఆటగాళ్లు లేకుండానే భారత జట్టు బరిలోకిదిగనుంది.
అయితే నేపథ్యంలో మాజీ స్టార్ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసియా కప్‌లో ఆడబోయే తన జట్టును ప్రకటించాడు. జట్టులో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరిలో ఒకరికిమాత్రమే చోటు దక్కుతుందని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించి 754 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐపిఎల్‌లో కూడా అతను నిలకడగా రాణించాడు. ఈ ప్రదర్శనను బట్టిశుభ్మన్ గిల్ ఆసియా కప్ జట్టులో తప్పకుండా ఉండాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు కైఫ్ చెప్పాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండక పోయినా, జట్టులో ఒక బ్యాకప్ ఓపెనర్‌గా అతను ఉండటం అవసరం. ఒకవేళ ఏ ఓపెనర్‌కు గాయమైతే.. శుభ్మన్ గిల్ ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంటాడు.
మహమ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్ ఇద్దరూ అద్భుతంగా రాణించినందుకు వారికిఈ అవకాశం లభించాలని తాను కోరుకుంటున్నట్లు మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకు చోటు వైస్ కెప్టెన్సీ పదవి గురించి మాట్లాడుతూ అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీని ఇవ్వాలని మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన వాషింగ్టన్ సుందర్‌ను కూడా జట్టులో ఎంపిక చేయాలని కోరాడు. అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కని కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్‌లను జట్టులో చేర్చాలని మహ్మద్ కైఫ్ భారత క్రికెట్ బోర్డు సూచించాడు.