- Advertisement -
అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో పోలీసులతో వైసిపి నేత పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య కారణంగా పెద్దారెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని డీఎస్పీతో పెద్దిరెడ్డి వాగ్వాదానికి దిగాడు. తాడిపత్రికి వెళ్లేందుకు తనకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్న కూడా పోలీసులు అడ్డుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. అంతా జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే జరుగుతోందని ధ్వజమెత్తారు. తాను ఎప్పుడు రావాలో కూడా జెసినే అడుగుతానన్నారు. ఎపిలో పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయిందని మండిపడ్డారు. మరోవైపు తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణకు టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వచ్చాడు.
- Advertisement -