Monday, August 18, 2025

ఓ ఇంటివాడు కాబోతున్న రాహుల్ సిప్లిగంజ్.. ఫోటోలు వైరల్.!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మాస్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj). యూట్యూబ్‌లో పాటలు పాడుతూ ఫేమస్ అయిన రాహుల్.. ఆ తర్వాత సినిమా పాటలతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. అయితే త్వరలో రాహుల్ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆయన హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఆగస్టు 17వ తేదీన వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కుటుంబసభ్యులు, ముఖ్యమైన స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకూ రాహుల్ నుంచి ప్రకటన రాలేదు.

కానీ, వేడుకకు హాజరైన కొందరు సోషల్‌మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది. రాహుల్, హరిణ్యలు చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని.. ఇప్పుడు పెద్దల సమక్షంలో వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి రాహుల్ (Rahul Sipligunj) ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రాహుల్ పాడిన ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడు టిపిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్‌కు రూ.10 లక్షలు బహుమానం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.కోటి నజరానాగా అందిస్తామని అప్పుడు రేవంత్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో చెక్కును అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News