హైదరాబాద్: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రామంతాపూర్ గోకుల్‌నగర్‌లో నిర్వహించిన శోభాయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథానికి విద్యుత్ తీగలు తాకి ఆరుగురు మృతి చెందారు. శోభాయాత్ర మరికొంత దూరంలో ఫూర్తవుతుంది అనగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరో 100 మీటర్లలో శోభాయాత్ర ముగుస్తుందనగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నామని.. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారని అన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు నివేదిక వచ్చాక బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రేటర్ హైదరాబద్‌లో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.