- Advertisement -
హైదరాబద్ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి (Kukatpally) ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఓ 12 ఏళ్ల బాలికను దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాలోకి వెళితే బాలిక తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా చూసి బాలిక సహస్రినిని హత్య చేశారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రినే బాలికను హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. మృతదేహనాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టిం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
- Advertisement -