Monday, August 18, 2025

శాంతితో యుద్ధాన్ని గెలవగలమని గాంధీ నిరూపించారు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్న గౌడ్ నిరూపించారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలన్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా పాపన్న గౌడ్ విగ్రహానికి సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రవీంద్రభారతిలో మాట్లాడారు. పాపన్న గౌడ్ కోటను గత ప్రభుత్వాలు మైనింగ్ లీజులకు ఇచ్చాయని, గతంలో ఖిలాస్ పూర్ కోటను కాలగర్భంలో కలపాలని చూశారని విమర్శించారు. చరిత్ర స్ఫూర్తి కోటను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని, భవిష్యత్తు తరాలు స్ఫూర్తి పొందేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు.

మన జాతి పిత మహాత్మగాంధీ కుటుంబం దేశానికి గొప్ప వరమని ప్రశంసించారు. శాంతితో యుద్ధాన్నిగెలవవచ్చు అని గాంధీ నిరూపించారని తెలియజేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సోనియా గాంధీ పదవులు త్యాగం చేశారని పేర్కొన్నారు. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు గాంధీ కుటుంబం గొప్ప నాయకత్వాన్ని అందించిందని, ప్రపంచవ్యాప్తంగా భారత్ ను గుర్తించినట్లే… గాంధీ కుటుంబాన్ని గుర్తిస్తున్నారని కొనియాడారు. గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శమని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని అన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News