హైదరాబాద్: నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిసి రిజర్వేషన్లలో ముస్లింలను కలిపారని తొండి వాదన చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్నా మోడీ, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో వేదికగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాదిపదికన రిజర్వేషన్లకు తావులేదని రాజ్యాంగంలోనే ప్రొవిజన్ ఉందని, బిసి రిజర్వేషన్లలో (BC reservations) మత ప్రాదికన రిజర్వేషన్లు ఉంటే చూపాలని సూచించారు. అబద్ధాలతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ లో ముస్లింలకు బిసి రిజర్వేషన్లను మోడీ తొలగించగలరా అని ప్రశ్నించారు. ముస్లిం వెనుకబడిన వర్గాలకు రాష్ట్రంలోనూ బిసి రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. ముస్లిం ముసుగుతో బహుజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
అబద్ధాలతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం : రేవంత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -