Thursday, August 21, 2025

ఏకగ్రీవం చేద్దాం

- Advertisement -
- Advertisement -

విపక్షాలకు ప్రధాని మోడీ పిలుపు సింధు
ఒప్పందం, నెహ్రూ పాలనపై విమర్శల దాడి
కేబినెట్, పార్లమెంట్ ఆమోదం లేకుండానే
పాక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని నెహ్రూపై
నిప్పులు సొంత ప్రతిష్ఠ కోసం దేశ
ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపణ
రాధాకృష్ణన్‌ను ఎన్‌డిఎ ఎంపిలకు పరిచయం
చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాజకీ య పక్షాలకు పిలుపునిచ్చారు. భిన్నమైన సామర్థాలతో ఆయన రా జకీయ జీవితం కొనసాగుతూ వస్తోందని, మచ్చ లేని రాజకీయ నా యకుడిని అత్యున్నత పదవికి ఎంపిక చేసుకోవాల్సి అవసరం ఉం దని అభిప్రాయపడ్డారు. మంగళవారంనాడిక్కడ ఎన్‌డిఎ ఎంపిల స మావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి పార్లమెంట్ సభ్యుల కు రాధాకృష్ణన్‌ను ప్రధాని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆ యనను సన్మానించారు. అనంతరం ప్రధాని మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని అంశాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ప్రధాన విపక్షం ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకునేందుకు ముందుకు రావాలని ప్రధాని కో రారు.

ఈ సందర్భంగా మోడీ సింధు నదీ జలాల ఒప్పందం, ప్రథ మ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఆమోదం లేకుండా, కనీసం కేబినెట్ సమ్మతి లేకుండా సింధు నదీ జలాల ఒప్పందంపై నెహ్రూ సంతకం చేశారని దుయ్యబట్టారు. తద్వారా రైతుల పట్ల నిర్లక్ష వైఖరిని అప్పట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చాటుకుందని ఆరోపించారు. సొంత ప్రతిష్ట కోసం ప్రజా ప్రయోజనాలను పాక్‌కు తాకట్టు పెట్టారని మోడీ మండిపడ్డారు. సింధు జలాల ఒప్పందంపై సంతకం చేసిన కారణంగా 80శాతం నీళ్లు పాక్ భూభాగానికే దక్కాయన్నారు. ఆ తప్పును నెహ్రూ కూడా గుర్తించారన్నారు. సింధు ఒప్పందం పాక్‌తో మిగతా అంశాల పరిష్కారానికి దోహదపడుతుందని నెహ్రూ భావించారని, కానీ అది జరగలేదని తన మంత్రివర్గ సహచరునితో అసంతృప్తి కూడా వ్యక్తం చేశారని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. అయితే తమ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసిందన్నారు. కాంగ్రెస్ పాలనా కాలాన్ని పాపాల యుగంగా మోడీ అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News