Wednesday, August 20, 2025

యూరియా వస్తోంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి తక్షణ మే 62 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కేటాయించిన ఈ యూరి యా వారం రోజుల్లో రాష్ట్రానికి వస్తుందని మం గళవారం తెలిపారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రా ల నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా త రలించాలని కేంద్రం ఆదేశాలిచ్చిందని తెలిపా రు. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వారం రోజుల్లో తెలంగాణకు యూరియా చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు. కాగా యూరియా సరఫరాపై మంగళవారం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ ఎంపీల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

మా ఒత్తిడితోనే యూరియా కేటాయింపు
యూరియా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేరుగా మంత్రి నడ్డాను కలిసి వివరించారని, ఎంపిలుగా తాము కూడా పలుమార్లు కలిశామని కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మల్లు రవి అన్నారు. తాము పలుసార్లు మంత్రిని కలవడం వల్లనే యూరియా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో మంగళవారం మంత్రిని ఢిల్లీలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా యూరియా కోసం ఎంపీలంతా పోరాడుతున్నామని, పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం కూడా ప్రతిదించామని తెలిపారు. ఎంపి చామల కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. దీనిలో 14 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి పంపినట్లు మంత్రి చెప్పారని స్పష్టం చేశారు. ఈ యూరియా ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రానికి వస్తుందని చామల చెప్పారు. వచ్చే వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News