Wednesday, August 20, 2025

కేబుల్ వార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : భాగ్యనగరంలో కేబుల్ వార్ మొ దలైంది. విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రై వేటు సంస్థల కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. ఈ చర్యలతో కేబుల్ ద్వారా అందించే ఇంటర్నెట్, టీవీ ఛానల్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేబు ల్ ఆపరేటర్లు, అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైర్లను తొలగించారని మండిపడ్డారు. పలుచోట్ల ఇళ్ల పైనుంచి కేబుళ్లు తక్కువ ఎత్తులో లాగి వదిలేస్తున్నారు. ఇలాంటివి ఎక్కడైనా తెగి కరెంటులైన్లపై పడినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నా యి. గతంలో చాలా చోట్ల స్థానికంగా టీవీ ప్రసారాలకు ఆపరేటర్లు ఎక్కడికక్కడ కేబుళ్లు ఏర్పాటు చేశారు. మరి కొన్నిచోట్ల వాటిని వినియోగించకపోయినప్పటికీ అలాగే వదిలేస్తున్నారు. అవీ ప్రమాదాల కు కారణమవుతున్నాయి. కాగా విద్యుత్ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేయడంతో  వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

రెండు గంటల్లో ఎయిర్ టెల్ కంపెనీకి 40 వేలు, జియోకు 20 వేల ఫిర్యాదులు అందాయి. ఒకటే రోజు దాదాపు లక్ష ఇంటర్నెట్ కనెక్షన్లను టిజిఎస్‌పిడిసిఎల్ సిబ్బంది కట్ చేశారు. రామంతపూర్, బండ్లగూడ ఘటనలకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కారణమంటూ విద్యుత్ శాఖ అధికారులు వీటిని యుద్ధ ప్రాతిపదికన మంగళవారం హైదరాబాద్ వ్యాప్తంగా తొలగించారు. దీంతో చెప్పా పెట్టకుండా ఇంటర్నెట్ కనెక్షన్లు ఎలా కట్ చేస్తారని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే తమ పరిస్థితి ఏంటని ఎక్స్ వేదికగా టిజిఎస్‌పిడిసిఎల్ మీద వినియోగదారులు మండిపడ్డారు. కేబుల్ వైర్లను తొలిగించడంతో హైదరాబాద్‌లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టిజిఎస్‌పిడిసిఎల్ విచక్షణారహితంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లను కట్ చేస్తోందని ఇంటర్‌నెట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్ టెల్, జియో ఫైబర్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది చర్యలతో మేడ్చల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ కేబుల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నామని, ఈ పరిస్థితుల్లో వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేస్తాం : కేబుల్ ఆపరేటర్ల హెచ్చరిక
రామంతపూర్‌లో జరిగిన ఘటనకు కేబుల్ ఆపరేటర్లుగా తాము సానుభూతిని తెలుపుతున్నామని, కానీ కేబుల్ ఆపరేటర్లను అనవసరంగా బలి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కేబుల్స్ కట్ చేయడం వల్ల లక్షలాదిమంది వినియోగదారులకు అంతరాయం జరిగిందని, 80 శాతం కట్ చేస్తే లక్షల నష్టం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ ఆపరేటింగ్‌పై లక్షకి పైగా ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని అంటున్నారు. తమను అడిగి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోని పక్షంలో, బుధవారం ఉదయం లోగా సిఎండి అధికారులు స్పందించకుంటే హైదరాబాద్ మొత్తం ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని కేబుల్ ఆపరేటర్లు హెచ్చరించారు.

కేబుళ్ల ఏర్పాటులో నిబంధనలు గాలికి :
నిబంధనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను భూమి నుంచి కనీసం 18 అడుగులకు పైన మాత్రమే ఏర్పాటు చేయాలి. వీటిని ఏదైనా కరెంటులైను లేదా స్తంభాన్ని తాకేలా తీసుకెళితే తప్పనిసరిగా డిస్కం నుంచి అనుమతి తీసుకోవాలి. కరెంటు స్తంభాలను ఆసరా చేసుకుని వీటిని ఏర్పాటు చేస్తే ఏటా కిరాయిని కూడా డిస్కంలకు చెల్లించాలి. అయితే కేబుళ్ల ఏర్పాటులో నిబంధనలను పాటించడం లేదని డిస్కంలు ఇప్పటికే పలుమార్లు ఆపరేటర్లకు నోటీసులిచ్చాయి. ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా కొనసాగిస్తున్న కేబుళ్లను తొలగించాలని విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలకు దిగింది. దీనతో స్థానిక నాయకులు, టీవీ, ఇంటర్నెట్ వినియోగదారులు అడ్డుకుంటున్నారు. దీంతో చేసేదేమీలేక విద్యుత్ సిబ్బంది చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. హైదరాబాద్ రామంతాపూర్‌లో ఆరుగురి మృతికి కూడా ఇలా రోడ్డకు అడ్డంగా లాగిన టీవీ కేబుల్ తెగి విద్యుత్ లైనుపై పడటమే కారణమని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)

అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఇలాంటి కేబుళ్ల ఏర్పాటులో చాలామేర ఆపరేటర్లు కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని డిస్కంల అధ్యయనంలో అధికారులు గుర్తించారు. ఈ వైర్లు తెగి కరెంటు లైన్లు, స్తంభాలపై పడితే విద్యుదాఘాతాలతో ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలతో ప్రతి సంవత్సరం సుమారు 600 మందికి పైగా చనిపోతున్నారు. వీటిలో మూడోవంతు మరణాలకు మానవ నిర్లక్ష్యమే కారణమని డిస్కంలో పరిశీలనలో గుర్తించారు. కాగా టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నది వాస్తవమేనని దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ అన్నారు. దీనికోసం ఎన్నిసార్లు చెప్పినా ఆపరేటర్లు సరిచేయడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కేబుళ్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News