మన తెలంగాణ/చాంద్రాయణగుట్ట/అంబర్‌పేట/కామారెడ్డి క్రైమ్ : వినాయమక విగ్రహాలను మండపాలకు తరలించే సమయంలో విద్యుదాఘాతాలతో పలువురి ప్రాణాలు పోతున్న ఘటనలు జరుగుతున్నా యి. తాజాగా మంగళవారం హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరిగి న వేర్వేరు సంఘటనలో నలుగురు చనిపోయారు. హైదరాబాద్ బం డ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో ఇద్దరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు.మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపిన ప్రకారం… పు రానాపూల్ చంద్రాపురానికి చెందిన దాదాపు 20 మంది యువకులు జల్‌పల్లి లక్ష్మీగూడ వద్ద 19 అడుగుల వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఇనుప ట్రాలీపై విగ్రహాన్ని ఏర్పాటు చేసి ట్రాక్టర్ సహాయంతో పురానాపూల్‌కు తరలిస్తున్నారు. ఆసమయంలో వర్షం కురుస్తుంది. నిర్వాహకులు కొందరు ద్విచక్ర వాహనాలపై విగ్రహాన్ని అనుసరిస్తున్నారు.
విగ్రహం బండ్లగూడ రాయల్‌సీ హోటల్ సమీపంలోకి రాగానే పైనున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ నడుపుతున్న ఉప్పుగూడ లలితాబాగ్‌కు చెందిన ధోని (21), పక్కనే కూర్చున్న బీహార్‌కు చెందిన వికాస్(20)లు తీవ్ర విద్యుదాఘాతానికి (కరెంట్ షాక్) గురైయ్యారు. విగ్రహం వద్ద ట్రాలిపై ఉన్న ధోని సోదరుడు, మరో యువకుడు అఖిల్ (23) సైతం విద్యుత్ షాకు గురై కింద పడిపోయారు. ధోని సోదరుడికి స్వల్ప గాయాలు కాగా అఖిల్ తీవ్ర గాయాలైయ్యాయి. ధోని సోదరుడు పెద్దగా కేకలు వేసినా స్థానికులు స్పందించ లేదు. ఎట్టకేలకు విగ్రహం వెంట ఉన్న ధోనీ సోదరుడు, మరో యువకుడు కలిసి గాయాలైన ధోని, వికాస్, అఖిల్‌ను ఆసుపత్రికి తరలించగా ధోని, వికాస్ చికిత్స పొందుతూ మృతి చెందారు. అఖిల్ అనే యువకుడు శాలిబండ వద్ద ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వినాయక విగ్రహాన్ని పోలీసులు క్రేన్ సహాయంతో వాహనంలో తిరిగి లక్ష్మీగూడకు తరలించారు.
అంబర్ పేటలో మరోకరు
రామంతపూర్ సంఘటన మరువకముందే అంబర్ పేట రెడ్ బిల్డింగ్ సమీపంలో ఒక యువకుడు వినాయక మండపం వేస్తుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందిన మరో విషాదం సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… అంబర్‌పేట రెడ్ బిల్లింగ్ సమీపంలో నివాసముంటున్న ఎం.లలిత భర్త లేట్ ఎం. రాజు కుమారుడు ఎం. రాంచరణ్ (18) కూల్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి స్నేహితులతో 15 ఫీట్ల వినాయక మండపము వేస్తుండగా రామ్ చరణ్ కట్టతో పైన ఉన్న కరెంటు వైర్లను పైకి లేపాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయారు. తల వెనుక భాగము, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో తోటి మిత్రులు, స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు.అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు కుటుంబ సభ్యులు కాచిగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఆస్పత్రిలో చికిత్స అందించారు. మంగళవారం సాయంత్రం చికిత్స పొందు తూ సాయంత్రం ఐదు గంటలకు ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో మరో యువకుడు మృతి
వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన కామారెడ్డి జిల్లా, పాల్వంచ మండలం, ఆరేపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వినాయక చవితి ఉత్సవాలకు ముందస్తుగానే గణనాథులను యువత సిద్ధం మండపాలకు చేరుస్తున్నారు. సిరిసిల్లకు చెందిన 15 మంది యువకులు ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్‌లో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి ట్రాక్టర్‌లో తీసుకెళ్తుండగా పాల్వంచ మండలం, ఆరేపల్లి శివారులో గల కస్తూర్బా పాఠశాల సమీపంలో విగ్రహం వైర్లకు తగలడంతో ట్రాక్టర్‌లో ఉన్న ఇద్దరికి విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోయారు. వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా సిరిసిల్ల గోపాల్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ (19) అనే యువకుడు మృతి చెందాడు. సుభాష్ నగర్‌కు చెందిన సాయికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.