Wednesday, August 20, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. 71 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అఫ్గానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 71 మంది మృతి చెందారు. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లోని గుజారా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్ వలసదారులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి.. ట్రక్కు, బైక్ లను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్నవారితోపాటు ట్రక్కులో ఇన్న ఇద్దరు, బైక్ పై ఉన్న ఇద్దరితో సహా మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారి మొహమ్మద్ యూసుఫ్ సయీది తెలిపారు.

మరణించినవారిలో 17 మంది చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. చాలా మంది మంటల్లో చిక్కుకుని కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. బాధితులను ఇరాన్ నుండి బహిష్కరించబడిన ఆఫ్ఘన్ జాతీయులుగా గుర్తించారు. వారు ఇస్లాం ఖాలా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశంలోకి ప్రవేశించి రాజధాని కాబూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News