పాన్ ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) నిర్మాతలు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. రిషబ్ శెట్టి బ్లాక్‌బస్టర్ కాంతారకు ప్రతిష్టాత్మక ప్రీక్వెల్‌లో కులశేఖర పాత్రలో నటిస్తున్నాడు గుల్షన్ దేవయ్య. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించి తానే మళ్లీ సెంట్రల్ క్యారెక్టర్‌గా నటిస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ మొదటి పార్ట్‌లో ఉన్న యూనివర్స్‌ని ఇంకా విస్తరించబోతోంది. ఈ సినిమా విజువల్ వండర్ గా (Visual wonder) ఉండబోతోంది. హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగందూర్ నెక్స్ లెవల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కులశేఖర పాత్రలో గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ బయటికి రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘కాంతార చాప్టర్ 1’లో కులశేఖరగా..
- Advertisement -
- Advertisement -
- Advertisement -