Wednesday, August 20, 2025

వాళ్లు కాదు మా బాస్‌లు .. తెలంగాణ ప్రజలే మా బాస్‌లు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్డిఎ, ఇండియా కూటములు ఉప రాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డిఎ అభ్యర్థిగా సి.పి.రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీలోకి దింపుతున్నారు. అయితే ఈ ఎన్నికలో బిఆర్‌ఎస్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందా అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంటూ డ్రామా జరుగుతోందని కెటిఆర్ (KTR) ఆన్నారు. బిసిలపై ప్రేమ నోటి వరకేనా.. చేతల్లో ఉండదా అని అడిగారు. తెలంగాణ నుంచి బిసి అభ్యర్థని ఎందుకు నిలబెట్టలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీ ఏ కూటమిలో లేదని.. ఈ ఎన్నికపై ఏ పార్టీ తమని సంప్రదించలేదని తెలిపారు. కానీ, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని మాత్రం వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

‘‘మాకు రాహుల్, మోదీ బాస్‌లు కాదు. తెలంగాణ ప్రజలే మా బాస్‌లు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నల యూరియా ఎవరు తెస్తారో.. వారికే మా మద్దతు ఉంటుంది’’ అని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News