Thursday, August 21, 2025

గురువారం రాశిఫలాలు (21-08-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కృషి ఫలిస్తుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం – ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోని అవకాశాలు అందిపుచ్చుకుంటారు.

మిథునం – ఋణవత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సాయం అందుతుంది. వివాదాలకు దూరంగా వుండండి. శ్రమాధికంగా వుంటుంది. సోదరుల నుండి ధనలాభం

కర్కాటకం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.

సింహం – ఇంటర్వ్యూలకు హాజరువుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తులాభం.

కన్య – సన్నిహితుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును

తుల – బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం – ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు, ఉద్యోగాలలో స్థాన మార్పులు వుంటాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం

ధనుస్సు – దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మకరం – ఋణాలు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. శుభవార్తలు.

కుంభం – గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరుల కలయిక. ఆరోగ్యం విషయాలలో నిర్లక్ష్యం తగదు.

మీనం – ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సంతానమునకు నూతన అవకాశాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News