హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇలా సమ్మెలతో ఇండస్ట్రీని చిక్కుల్లోకి నెట్టడం కరెక్ట్ కాదని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వేతనాలు పెంచాలని కొన్ని రోజులుగా సినీ కార్మికులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫెడరేషన్ సభ్యులు, సినీ నిర్మాతలు పలుమార్లు చర్చలు జరిపినా కూడా సఫలం కాలేదు. దీంతో తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమ్మె ప్రభావం సినిమా పాలసీపై పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, వేతనాల పెంపు కోసం ఫెడరేషన్ సభ్యులు చేస్తున్న సమ్మెకు నేటితో 17 రోజులు గడిచింది. సమ్మె కారణంగా షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు, ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నామని తాము అంత పెంచలేమని నిర్మాతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
సమ్మెలతో ఇండస్ట్రీని చిక్కుల్లోకి నెట్టడం పద్ధతి కాదు: సిఎం రేవంత్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -