డబ్బులతో సాగే ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధ సంబంధిత బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. దేశంలో ఆన్‌లైన్ గేమ్స్ పేరిట సాగుతున్న తంతు చివరికి ఇది ఓ వ్యసనంగా, మనీలాండరింగ్‌కు రాదారిగా , ఆర్థిక మోసాలకు వేదికగా మారుతూ ఉండటంతో ఈ గేమ్స్ నిషేధ చట్టానికి ప్రభుత్వం సంకల్పించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను కూడా నిషేధిస్తారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ బిల్లును ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుగా తీసుకువచ్చారు. చట్టంగా అమలులోకి వస్తే ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, సట్టా , జువాలపై వేటు పడుతుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వినోద కాలక్షేప వ్యవహారాలుగా సాగుతున్న పోకర్, రమ్మీ, ఇతర కార్డు ముక్కల ఆటలు, ఆన్‌లైన్ లాటరీలు చట్ట వ్యతిరేకం అవుతాయి. సభలో ప్రతిపక్షాల నిరసనల దశలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ బిల్లుపై తమ మాటలతో , తరువాతి మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్తల నుంచి ఎటువంటి నిధులు సమకూర్చకుండా కట్టుదిట్టమైన ఆంక్షలతో ఈ బిల్లు రూపొందించారు.
బిల్లు ఆమోదం పొందగానే సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌లు చివరికి పందాలకు దారితీశాయి. ఈ బెట్టింగ్‌లకు సినిమా ఇతర రంగాల దిగ్గజాల నుంచి ప్రచార ప్రకటనలు కూడా జోరందుకున్నాయి. ఎక్కువగా వ్యాపిస్తూ సాగిన ఆన్‌లైన్ గేమ్స్ బెట్టింగ్‌ల వలయంలో చిక్కుకుని పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు కలకలానికి దారితీశాయి. ఈ దశలోనే ఆన్‌లైన్ గేమ్స్ బెట్టింగ్‌లు, వీటి నిర్వహణ, లావాదేవీల నియంత్రణ పేరిట తీసుకువచ్చిన ఈ బిల్లుతో ఇక ఆన్‌లైన్ గేమ్స్ ఆటకట్టు అవుతుంది. ఉభయ సభల ఆమోదం తరువాత అమలులోకి వచ్చే నిషేధ చట్టం అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆన్‌లైన్ గేమ్స్ నిర్వాహకులు , వీటికి అవకాశం కల్పించే వారికి కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష , గేమ్స్ స్థాయిని బట్టి రూ 1 కోటి వరకూ జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్ గేమింగ్‌లకు, ఈ స్పోర్ట్‌కు మధ్య తేడాను స్పష్టం చేసేలా ఈ బిల్లును రూపొందించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు ప్రచాచకర్తలకు కనీసం రెండేళ్ల జైలు, గరిష్టంగా రూ 50 లక్షల వరకూ ఫైన్ పడుతుంది. ఇక ఆన్‌లైన్ గేమ్‌లకు దిగేవారికి శిక్షలు ఉండకుండా మినహాయింపులు ఇచ్చారు. వీరిని బాధితులుగా చూపారు.
నిషేధం కాదు నియంత్రణ
ఆన్‌లైన్ గేమింగ్ ఫెడరేషన్ విజ్ఞప్తి
ఆన్‌లైన్ గేమింగ్‌ను వెంటనే నిషేధించడం వద్దు నియంత్రించాలని సంబంధిత ఆన్‌లైన్ గేమింగ్ ఫెడరేషన్ కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి ఓ లేఖ పంపించింది. కొన్ని విషాదకర పరిణామాలు జరిగితే మొత్తం ప్రక్రియనే ఎత్తివేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ ఆన్‌లైన్ గేమింగ్‌పై ఆధారపడి లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. నిజమైన గేమర్ ఇకపై రహస్య అక్రమ గేమింగ్‌ల వైపు మళ్లుతాడు. ఇది ఆర్థికంగా ఇబ్బందికర పరిణామానికి దారితీస్తుందని తెలిపారు. ఇ గేమింగ్ ఫెడరేషన్ , ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్ కూడా తమ ఆందోళన వ్యక్తం చేశాయి.