రూ.60 వేలు లంచం తీసుకుంటూ సిబిఐ అధికారులకు హైదరాబాద్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్లు దుర్గాప్రసాద్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గొల్లు దుర్గాప్రసాద్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ఈ ఘటన హైదరాబాద్-వరంగల్ హైవేలోని బిబినగర్ టోల్ ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది. ఎన్‌హెచ్‌ఎఐ వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గొల్లు దుర్గాప్రసాద్ బిబినగర్ టోల్ ప్లాజా సమీపంలో హైవే పక్కన రెస్టారెంట్ నడుపుతున్న ఒక వ్యక్తి నుంచిలక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అందులో రూ. 60,000 తొలి వాయిదాగా తీసుకుంటూ అరెస్టయ్యాడని సిబిఐ పేర్కొంది. దుర్గాప్రసాద్, హైవే పక్కన రెస్టారెంట్ నడ పడానికి సంబంధించి అనుమతి లేదా సౌకర్యాల కోసం రెస్టారెంట్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
సొంత స్థలంలో ఉన్నా హైవే పక్కన హోటల్ నడపాలంటే లంచం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తొలగిస్తామని హెచ్చరించినట్లు గా ఆరోపణలున్నాయి. బాధితులు సిబిఐకి ఫిర్యాదు చేశారు. సిబిఐ ఈ కేసులో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. దుర్గాప్రసాద్‌ను లంచం తీసుకుంటూ ఉన్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అరెస్టు సమయంలో దుర్గాప్రసాద్‌తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా అరెస్టయ్యా డు. హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలో దుర్గాప్రసాద్‌కు సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిం చారు. ఈ సోదాల్లో అనేక ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సిబిఐ ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేస్తోంది, ఇందులో ఇతర అధికారులు లేదా వ్యక్తుల ప్రమేయం ఉందా అని కూడా పరిశీలిస్తోంది. ఈ ఘటన బుధవారం జరిగినట్లు సిబిఐ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఈ కేసు ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తూ, అవినీతిలో పాల్గొన్న ఇతర సంఘటనలతో పోల్చితే తక్కువ మొత్తం (60,000) లంచం అయినప్పటికీ దుర్గా ప్రసాద్ పై పలు ఆరోపణలు ఉండటంతో దాడులు చేశారు. గతంలో ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు 10 లక్షలు లేదా 15 లక్షల లంచం కేసుల్లో అరెస్టయిన సందర్భాలున్నాయి. 2024లో మధ్యప్రదేశ్‌లో 10 లక్షలు, 2025లో బీహార్‌లో 15 లక్షల లంచం కేసుల్లో ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు అరెస్టయ్యారు.