Thursday, August 21, 2025

అగ్ని 5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

భారతదేశం బుధవారం అగ్ని 5 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది భారత వ్యూహాత్మక సైనిక సామర్థ్యానికి అద్దం పడుతోంది. ఒడిశాలోని చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సమర్థవంతంగా అగ్ని 5 క్షిపణి పరీక్ష అన్ని సాంకేతిక, కార్యాచరణ లక్ష్యాలను అందుకున్నామని ధృవీకరించిందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. గతంలో 2024 మార్చి 11న ఇదే పరీక్షా కేంద్రం నుంచి అగ్ని 5ని చివరిసారిగా పరీక్షించిందని ఈ పరీక్షలో భాగంగా డిఆర్ డిఓ మల్టిపుల్ ఇండి పెండెంట్ రీ – ఎంట్రీ వెయికల్ ( ఎంఐఆర్ వి) సాంకేతికను ఉపయోగించి విజయవంతంగా పరీక్షను నిర్వహించిందని
రక్షణ వర్గాలు తెలిపాయి. భారతదేశం తొలిసారిగా ఏప్రిల్ 19, 2012న చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి
అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది, హిందూ మహాసముద్రంలో నిర్దేశించిన స్థలమే లక్ష్యంగా ప్రయోగించింది. క్షిపణి 5 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించి, గరిష్టంగా ఆరు కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News