మన తెలంగాణ/హైదరాబాద్:రా జ్యాం గం కల్పించిన ప్రాథమిక ఓటు హక్కును ప్రశ్నార్థకంగా మార్చిన కేంద్రంలోని బిజె పి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని ‘ పొట్లూరి నాగేశ్వరరావు నగర్’ (గాజుల రామారం)లోని ‘ఎన్.బాలమల్లేశ్ హాల్’ (మహారాజా గార్డెన్స్) లో మూడు రోజు ల పాటు జరిగే సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సిపిఐ శ్రేణులు ఎర్ర చొక్కా లు, ఎర్ర చీరలు ధరించి పెద్ద ఎత్తున హా జరయ్యారు. ప్రాంగణమంతా అరుణవ ర్ణం సంతరించుకుంది. ముందుగా షా పూనగర్ నుంచి కళానాట్యమండలి ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్ల మధ్య ఎర్రజెండా లు చేతపట్టుకొని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాసభ ప్రారంభోత్సవ కా ర్యక్రమం జరిగింది. మహాసభ ఆహ్వా న సంఘం అధ్యక్షులు ఎండి.యూసుఫ్ అ ధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి గా డి. రాజా, అతిథులుగా సిపిఐ జాతీ య కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా పాల్గొన్నారు.
సభ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సౌహార్ధ సందేశాలిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి, కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహా య కార్యదర్శి తక్ళెపల్లి శ్రీనివాస రావు, సిపిఐ ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, మాజి ఎంఎల్‌ఎ పి.జె.చంద్రశేఖరరావు, సిపిఐ సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, కవి, రచయిత ఏటుకూరి ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, కళవేన శంకర్, ఎం.బాల నరసింహా, వి.ఎస్.బోస్, ఇ.టి.నరసింహా, ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మాదాల రవి, ఆహ్వాన సంఘం నాయకులు డి.జి.సాయిల్, ఇ.ఉమా మహేశ్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి రాజా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా చూడడంలో భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థగా, తటస్థ సంస్థగా పని చేయడం లేదని మండిపడ్డారు. అందుకే బిహార్‌లో ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షించబడాలంటే బిజెపిని, ప్రధాని మోడీని అధికారం నుంచి దించి వేయాల్సిందేనన్నారు.
అందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి బిజెపిని, మోడీని గద్దె దించేందుకు పోరాటం చేయాలన్నారు. దేశం ప్రస్తుతం అత్యంత సంక్షిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రాథమిక హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంపై దాడి పెరిగిందన్నారు. పార్లమెంట్‌ను పనిచేయనివ్వడంలేదని, అది పని చేయకపోతే ప్రజాస్వామ్యం అంతమవుతుందని, ప్రజాస్వామ్యం విధ్వంసం అవుతుందని రాజా హెచ్చరించారు. త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ ఎలా పనిచేస్తుందనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. ఎన్నికల కమిషన్ అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. భారత్ హిందూత్వ దేశం, మతతత్వ రాజ్యాంగా మారితే దేశానికే పెద్ద విపత్తుగా పరిణమిల్లుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏనాడో హెచ్చరించారన్నారు. దేశాన్ని కాపాడాలంటే బిజెపికి వ్యతిరేకంగా, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అందుకే ఇండియా కూటమి ఏర్పాటైందని, దాని ఏర్పాటులో సిపిఐ కీలక పాత్ర పోషించిందని రాజా తెలిపారు
ఉప రాష్ట్రపతి ఎన్నిక రాజకీయ యుద్దం
ఉప రాష్ట్రపతి ఎన్నికలు దేశ చర్రితలో ఎంతో కీలకమని, ఈ ఎన్నిక రాజకీయ యుద్ధమని రాజా అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ప్రకటించారని, సిపిఐ కూడా మద్దతు ప్రకటించిందని, లౌకిక పార్టీలన్నీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో సిపిఐ బలం పెరగాలి
కార్మికులు, రైతులు, మహిళలు, కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని రాజా పిలుపునిచ్చారు. తెలంగాణలో సిపిఐ అత్యంత బలమైన పార్టీ అని, ప్రస్తుతం ఒక్క ఎంఎల్ ఎంఎల్‌సి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ప్రజాసమస్యలను మరింత ఎలుగెత్తి చాటేందుకు పార్లమెంటు, అసెంబ్లీ, ప్రతి ప్రజాప్రాతినిధ్య ఎన్నికల్లో సిపిఐ బలం పెరగాలని ఉద్ఘాటించారు.
మతోన్మాద బిజెపిని అడ్డుకునే శక్తి వామపక్షాలకే ఉంది ః కందిమళ్ల ప్రతాపరెడ్డి
వీర తెలంగాణ గడ్డపై మతోన్మాద బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి కేవలం వామపక్ష పార్టీలకే ఉందని, ఇందుకు అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలని సిపిఐ సీనియర్ నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధులు కందిమళ్ల ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ చీలికతో కొంత బలహీనమైందని, దీనిని అధిగమించేందుకు దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు, మేధావులను ఏకం చేసేందుకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా కీలకపాత్ర పోషించాలన్నారు. తెలంగాణ విప్లవగడ్డపై కమ్యూనిస్టుల పాత్ర ఏమిటనేది మహాసభలో ఆత్మపరిశోధన చేసుకోవాలని సూచించారు.
అమరుల రక్తంతో ఎరుపెక్కిందే ఎర్ర జెండా ః ఏటుకూరి ప్రసాద్
అమర రవీరుల రక్తంతో ఎరుపెక్కిన జెండా ఎర్రజెండా అని, నిజాంకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో అమరులైన వారి వారసత్వం బాట ఎర్రబాట అని ఏటుకూరి ప్రసాద్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజం మళ్లీ విజృంభిస్తుందన్నారు. గతంలో కమ్యూనిస్టులు రక్తార్పణతో ఏ అశయాలు, అదర్శాలతో ముందుకు వెళ్లారో ఆ ఆశయాల స్పూర్తిని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సినీ నటులు మాదాల రవి మాట్లాడుతూ కమ్యూనిస్టు శక్తులన్నీ ఏకమై పోరాటం చేసినప్పుడే సామాన్యుడి గుండె ప్రతిధ్వనిస్తుందని, కుల్లుతున్న వ్యవస్థను కూకటి వేళ్లతో పీకేస్తారని అన్నారు.