Thursday, August 21, 2025

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యూరియా కోసం రైతన్నలు బుధవారం రోడ్డెక్కారు. వ రంగల్ జిల్లా, ఖానాపురం మండలం, బుధరావుపేట గ్రామంలోని రైతు వే దిక వద్ద యూరియా బస్తాల కోసం రై తులు ధర్నా నిర్వహించారు. వీరికి మ ద్దతుగా నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పె ద్ది సుదర్శన్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయాధికారులు కుమ్మక్కై సామాన్య రై తులను యూరియా కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. యూరియా బస్తాలు దొరకక రైతులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉంటే స్థా నిక ఎంఎల్‌ఎ, మంత్రులు రైతుల సమస్యలపై మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
తరువాత రైతులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి.

యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారని వాపోయారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి గిరిజన మహిళలు, సన్నకారు రైతులు 7 నుంచి 8 గంటలు క్యూలో నిలబడినా టోకెన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు టోకెన్లు ఇళ్లకు పంపుతున్నారు. ఆఫీసు గేటు తీయకముందే యూరియా కోసం వందలాదిగా మంది రైతులు, మహిళా రైతులు తరలివచ్చారు. వర్షంలోనూ యూరియా కోసం అర కిలోమీటర్ 8 గ్రామాల మేర క్యూకట్టారు. వచ్చింది 400 బస్తాల యూరియా వందలాదిగా రైతులు లైన్లలో వేచి చూస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వర్షకాలం పంటకు ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

యూరియా కొరతపై బిజెపి నాయకుల ఆందోళన
నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలంలో యూరియా కొరత తీవ్రంగా మారింది. రైతులు సొసైటీ ఆఫీసుల చుట్టూ రోజువారీగా తిరుగుతున్నా సరైన విధంగా యూరియా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన పలువురు రైతులు గత నాలుగు, ఐదు రోజులుగా టోకెన్లు తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు యూరియా పంపిణీ జరగలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రైతులు బిజెపి నాయకులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన పెద్దకొత్తపల్లి సొసైటీ ఆఫీస్‌కు చేరుకుని అక్కడ సిఈఓ సిరాజ్‌ని కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ..

రబీ సాగు ఈ సంవత్సరం యూరియా సరఫరా తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా పంపిణీలో పారదర్శకత లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్ హామీలు వాస్తవంగా అమలు కావడం లేదని, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడంపై ధ్వజమెత్తారు. రైతులకు అనేక ఆంక్షలు పెడుతూ రెండు ఎకరాలపైన ఎంత భూమి ఉన్నా కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని యూరియాతో పాటు నానో లిక్విడ్ కచ్చితంగా కొనాలని షరతులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు గుంపల్లి అశోక్ అన్నారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

చేగుంటగజ్వేల్ రహదారిపై రైతుల రాస్తారోకో
యూరియా సకాలంలో అందించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా, చేగుంట మండల పరిధిలోని మక్కరాజిపేటలో చేగుంట=గజ్వేల్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి అందరికీ యూరియా వచ్చేవిధంగా అధికారులతో మాట్లాడి ఇప్పస్తానని తెలపడంతో ఆందోళన విరమించారు.

సిద్దిపేటలో ధర్నా
సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామం వద్ద యూరియా కోసం పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు యూరియా లేకపోవడంతో కామారెడ్డి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు సరైన కాలంలో యూరియా అందించకపోవడం ఎంతో బాధాకరమన్నారు. నేడు రైతులు యూరియా కోసం చెప్పులు వరుసలో పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పంటలకు సరైన సమయంలో యూరియా అందించకుంటే పంట దిగుబడి దెబ్బతింటోందని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు.

ఖాళీ కడుపుతో క్యూలో పడిగాపులు
సిద్దిపేట జిల్లా, అక్కన్నపేటలో యూరియా కొరతతో రైతన్నలకు చుక్కలు కనబడుతున్నాయి. పనులు సైతం మానుకొని, ఖాళీ కడుపుతో పొద్దస్తమానం ఎరువుల కోసం ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూ కట్టి పడిగాపులు కాసినా సరిపడా యూరియా దొరకడం లేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి రైతుకు రెండు బస్తాల యూరియా కంటే ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల పంటల సాగుకు రెండు బస్తాలు సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట మండలంలోని నందారం, గండిపల్లి రెవెన్యూ గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సీలింగ్ భూములు ఉండడంతో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడం, పట్టాదారుడు మరణిస్తే పట్టా మార్పిడి జరగకపోవడం వల్ల యూరియా ఏ విధంగా తెచ్చుకొని వ్యవసాయం చేసుకోవాలంటూ అయోమయానికి గురవుతున్నారు.

ఎరువుల కొరతపై రహదారిపై ధర్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అమరవీరుల స్తూపం వద్ద కామారెడ్డి-=సిద్దిపేట ప్రధాన రహదారిపై బుధవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపిటిసి సభ్యుడు ఎగదండి స్వామి కూడా పాల్గొని రైతులకు అండగా నిలిచారు. ‘రైతులకు సరిపడా ఎరువులు అందించకపోతే, మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని‘ ఎగదండి స్వామి హెచ్చరించారు.

యూరియా కొరతపై బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, నుస్తులాపూర్ గ్రామంలో బుధవారం రైతులకు తగినంత యూరియా అందించాలని కోరుతూ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జిఇ రామకృష్ణారావు మాట్లాడుతూ.. వెంటనే రైతులందరికీయూరియా అందించకపోతే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను అరిగోస పెడుతుందని ప్రజల ఉసురు మంచిది కాదని ఆగ్రహం వ్యక్త ం చేస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News