Thursday, August 21, 2025

ఎకరం ధర రూ.70కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కెపిహెచ్‌బిలో హౌ సింగ్ బోర్డు భూములు ఎకరం ధర రూ.70 కోట్ల ప లికింది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ లో 7.8 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చే యడానికి రియల్ రంగంలో ఉన్న బడా కంపెనీలు పోటీ పడ్డాయి. హౌజింగ్ బోర్డు బుధవారం పారదర్శకంగా ఈ – వేలం ద్వారా ఈ భూములను విక్రయించింది. వేలం ప్రక్రియలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన గోద్రేజ్ ప్రాపర్టీస్, అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టెట్స్, అశోక బిల్డర్ వంటి సంస్థలు పోటీపడ్డా యి. ఎకరం రూ.70కోట్ల ధరతో ఇక్కడి భూములను గోద్రేజ్ సంస్థ కొనుగోలు చేసింది. కూకట్ పల్లిలోని 7.80 ఎకరాల భూములను ఈ-వేలం ద్వారా విక్రయించడానికి హౌసింగ్ బోర్డు జూలై నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. బుధవారం నాడు ఆన్ లైన్ పారదర్శకంగా నిర్వహించిన వేలం పాటలో

దేశ వ్యాప్తంగా పేరుగాంచిన గోద్రేజ్ ప్రాపర్టీస్, అరబిందో, ప్రెస్టీజ్ అశోకా బిల్డర్స్ సంస్ధలు పాల్గొన్నాయని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. సుమారు మూడున్నర గంటల పాటు నిర్వహించిన ఈ వేలం పాటలో ఎకరాకు రూ .40 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా, బిడ్డర్లు 46 సార్లు ధరను పెంచుతూ వేలంలో పాల్గొన్నారు. ఈ భూముల విక్రయం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.547 కోట్ల మేర ఆదాయం సమకూరిందన్నారు. ఇలా భూముల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం కల్గించే గృహ నిర్మాణ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.

రాజీవ్ స్వగృహ టవర్లలో రూ.70.11 కోట్ల ఆదాయం
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు చెందిన టౌన్ షిప్ లలో అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్థుల భవనాల (3 టవర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వానికి 70.11 కోట్ల ఆదాయం వచ్చినట్లు గౌతమ్ వెల్లడించారు. నగర శివార్లలోని పోచారం టౌన్ షిప్ లో మొత్తం 194 ఫ్లాట్లు ఉన్న రెండు టవర్లను (112 ఫ్లాట్లు, 72 ఫ్లాట్లు), గాజుల రామారం లోని 112 ఫ్లాట్ లు ఉన్న ఒక టవర్ ను బుధవారం నాడు లాటరీ ద్వారా కేటాయించారు. పోచారంలోని నిర్మాణాలకు చదరపు అడుగు ధర రూ.1,650లకు, గాజులరామారంలోని వాటికి రూ.1,995లుగా నిర్ణయించారు. పోచారంలో 72 ఫ్లాట్లతో అసంపూర్తిగా ఉన్న టవర్ ను ఎన్ టి పిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ కు రూ.13.78 కోట్లకు, 122 ఫ్లాట్లు ఉన్న మరో టవర్ ను గాయత్రీ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టు వారికి రూ.30 కోట్ల మొత్తానికి లాటరీ ద్వారా కేటాయించారు. అలాగే గాజులరామారం లోని 112 ఫ్లాట్లతో అసంపూర్తిగా ఉన్న టవర్ ను ఎఫ్ సి ఐ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి రూ. 26.33 కోట్ల మొత్తానికి కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News