Thursday, August 21, 2025

రోడ్డు ప్రమాదంలో ర్యాపిడో బైక్ డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. ర్యాపిడో డ్రైవర్ గా వృత్తి నిర్వహించే ఎం తరుణ్ (25) ద్విచక్ర వాహనాన్ని గార్బేజ్ తరలించే ఆటో వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందాడు. నలగండ్ల ఫ్లై ఓవర్ పైన ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.. మరో ఘటనలో రాకేష్ జెన (39)ఈ నెల 16 న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పి జె ఆర్ ఎనక్లేవ్ రోడ్డులో అదుపుతప్పి పడిపోవటంతో తీవ్రంగా గాయపడ్డారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఓరిస్సా రాష్టానికి చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News