Thursday, August 21, 2025

కెసిఆర్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై జస్టిస్ పిసి ఘో ష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావులు దా ఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. వీటిపై గురువారం విచార ణ జరుపనున్నట్టు కోర్టు ప్రకటించింది. కాళేశ్వ రం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ, కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్లు దా ఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఘోష్ క మిషన్ నివేదిక ఏకపక్షంగా, ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారని పిటిషన్లలో వారు ఆ రోపించారు. రాజకీయ కక్షలో భాగంగా గత బిఆర్‌ఎస్‌ను ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు క మిషన్ నియామకం జరిగిందని, నిబందనలకు వి రుద్దంగా కమిషన్ నివేదిక రూపొందించిందని పి టిషనర్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News