Thursday, August 21, 2025

వేణుస్వామికి ఘోర అవమానం…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామికి ఘోర అవమానం జరిగింది. ఆయనను ఆలయం నుంచి గెంటివేయడం అనేది వివాదాస్పదంగా మారింది. కామాఖ్య ఆలయ సిబ్బంది ఆయనను గుడిలోకి రానివ్వకుండా బయటకు గెంటి వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాం రాజధాని డిస్పూర్ సమీపంలో ఉన్న గౌహతిలోని కామాఖ్య ఆలయంలో తాంత్రిక పూజలు చేస్తుంటానని వేణుస్వామి ప్రచారం చేశారు. లక్షల్లో ఖర్చు ఉంటుందని ఆయన చెప్పారు. దాని వల్లే కామాఖ్య సిబ్బంది వేణుస్వామిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు వేణుస్వామిపై కామెంట్లు చేస్తున్నారు. వేణు స్వామికి మంత్రాలు, తంత్రాలు కూడా వస్తాయా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News