Thursday, August 21, 2025

మియాపూర్ లో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. మక్త మహబూబ్ పేటలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. మృతులు కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి వాసులు లక్ష్మయ్య(60), వెంకటమ్మ(55), అనిల్(32), కవిత(24)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News