నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. (Gurram Papireddy) ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథ తో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి ’ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ (Catchy Lyrics) అందించగా, లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ ఎనర్జిటిక్ గా పాడారు. కృష్ణ సౌరభ్ ఆకట్టుకునే ట్యూన్ తో కంపోజ్ చేశారు. ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి, ఏరు దాటివేయ్, ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి, ఓ రూటు వేయ్ గుర్రం పాపిరెడ్డి, ఏక్ మార్ 1234 తుక్కడ, నింగినుంచి ఊడిపడ్డ వాడు ఎవ్వడు ఇక్కడ, మంకీ నుంచి వచ్చిన వాళ్లే కదా అందరు ఇక్కడ, నీరసించి నీరుగారి ఉండిపోకు ఎక్కడ..’ అంటూ మంచి బీట్తో పాటు ర్యాప్ స్టైల్లో సాగుతుంది ఈ పాట.
ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి..
- Advertisement -
- Advertisement -
- Advertisement -