Thursday, August 21, 2025

బైక్ పై వెళ్తుండగా భర్తపై యాసిడి పోసిన భార్య

- Advertisement -
- Advertisement -

అగర్తాలా: వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు చంపేస్తున్నారు. వివాహం జరిగిన వారం, పది రోజులకే భర్తలను భార్యలు హత్యలు చేసిన సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. అత్తారింటికి బైక్‌పై వెళ్తుండగా భర్తపై భార్య యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన త్రిపురలోని సిద్ధాయ్ మోహన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శిబాజీ దెబర్మా అనే రైతు తన భార్య సుమిత్రాతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శిబాజీ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులు ద్విచక్ర వాహనం చంద్రపూర్ వెళ్తుండగా మార్గం మధ్యలో భర్త మెడపై భార్య యాసిడ్ పోసింది. వెంటనే బైక్‌ను ఆపి కేకలు వేశాడు. అప్పటికి మరోసారి భర్తపై భార్య యాసిడ్ దాడి చేయడానికి ప్రయత్నించింది. స్థానికులు రక్షించి గాయపడిన శిబాజీని జిబిపి ఆస్పత్రికి తరలించారు. భార్య గృహ హింసకు గురైన బాధితురాలిగా కనిపిస్తోందని పోలీస్ అధికారి హిమాద్రి సర్కార్ తెలిపారు. అందుకే ఆమె తన భర్తపై యాసిడ్ దాడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. భర్త ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని, తాము విచారణ చేస్తున్నామని, యాసిడ్ దాడి చేసిన తర్వాత ఆ భార్య పారిపోయిందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News