Thursday, August 21, 2025

పెద్దపెద్ద మాటలు మాట్లాడి అభాసుపాలు కావద్దు: తుమ్మల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి అత్యవసరాన్ని గుర్తించి యూరియాను త్వరగా ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. రాష్ట్రానికి ఆగస్టు వాటా యూరియా ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..యూరియాను కనీసం చూడని నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడి అభాసుపాలు కావద్దని, తనను విమర్శించేవారు కేంద్రమంత్రి జెపి నడ్డాను అడగవచ్చు అని సలహా ఇచ్చారు. యూరియా సరఫరా అన్ని లెక్కలు ఇస్తున్నానని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అంటే తనకు గౌరవం ఉందని తుమ్మల తెలియజేశారు. అబద్ధాలు చెప్పి బిజెపి బాగు చేయాలంటే సాధ్యం కాదని, రైతులపై రాజకీయాలు చేసి పార్టీని పెంచుకోలేరని దుయ్యబట్టారు. వాస్తవాలు రాంచందర్ రావు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

యూరియాపై ఎప్పటికప్పుడు లెక్కలు కేంద్రానికి పంపుతున్నామని, నిన్న గాక మొన్న వచ్చిన రాంచందర్ రావు విమర్శలు సరికావని (Criticism correct) మండిపడ్డారు. శవాలపై పేలాలు ఏరుకునేలా బిజెపి వ్యవహారం ఉందని, యూరియాపై బిజెపి అసత్య ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. రాంచందర్ రావుకు పలుకుబడి ఉంటే యూరియ తెప్పించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా యూరియా సమస్య ఉందని, యూరియా దాచుకుని తాము ఏం చేసుకుంటాం? అని ప్రశ్నించారు. పదేపదే రాంచందర్ విమర్శలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, యూరియాపై  బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడానని అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాంచందర్ యూరియా తెప్పించాలని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News