హైదరాబాద్: మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. జంపన్న వాగును పర్యాటక శాఖతో కలిసి అభివృద్ధి చేస్తామని, స్మృతి వనాన్ని 29 ఎకరాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీ పూజారులతో కలిసి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలియజేశారు. నిధులు మంజూరు చేసినందుకు సిఎం, డిప్యూటీ సిఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సిఎం రేవంత్ ఆదేశాలతో మేడారం జాతరకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో కలిసి కెటిఆర్ నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. యూరియా కోసం కాంగ్రెస్ ఎంపిలు కేంద్రంతో పోరాడుతున్నారని, కెటిఆర్‌కు మా ఎంపిల పోరాటం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కెటిఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సీతక్క చురకలంటించారు.