- Advertisement -
అమరావతి: ఎపి రాష్ట్రంలో పరిపాలనను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైసిపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తెలిపారు. ఎపిలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని అన్నారు. బొత్స మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇవ్వలేదని విమర్శలుగుప్పించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాది రైతు భరోసా (Farmer Assurance) సాయం ఎగ్గొటిందని విమర్శించారు. 8 లక్షల మందికి అన్నదాత, సుఖీభవ సాయం అందలేదని, లక్షన్నర కోట్లు అప్పు చేసి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎపిలో పసిపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, భూకజ్జాలు, దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -