ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. మియాపూర్‌లోని మక్తామహబూబ్‌పేట్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలిసులు స్థానికుల వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గ జిల్లా, అనంతపురంకు చెందిన ఉప్పరి లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55) లకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. గత మూడు సంవత్సారల క్రితం లక్ష్మయ్య, వెంకటమ్మ దంపతులు మియాపూర్‌లోని మక్తా గ్రామంలో అద్దెకు నివాసముంటూ మేస్త్రీ పనిచేసుకంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య వెంకటమ్మ బాచుపల్లిలోని వికాస్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుంది. పెద్ద కుమార్తె లక్ష్మి చాంద్‌పాషా పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని బాచుపల్లిలో నివాసముంటున్నారు. మద్య కుమార్తె కవిత, అనిల్‌కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. చిన్న కూతురు వినితకు దుర్గప్రసాద్‌తో రెండెళ్ల క్రితం వివాహం జరిగింది.
వారు లింగంపల్లిలో ఉంటూ మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మయ్య మద్య కుమార్తె కవిత, అల్లుడు అనిల్ కొద్ది రోజులు కాళిమందిర్‌లో నివాసముండి మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. అనంతరం చెవేళ్ల, జీయగూడ ప్రాంతాలలో మేస్త్రి పనిచేసి గత వారం రోజుల క్రితం మియాపూర్‌లోని మక్తా ప్రాంతాంలో నివాసముంటున్న లక్ష్మయ్య వద్దకు కూతురు, అల్లుడు వచ్చారు. అక్కడే ఏదో ఒక పని చేసుకొని ఉండేందుకు రూం అద్దెకు తీసుకొని అడ్వాన్స్ ఇచ్చాడు. బుధవారం రాత్రి లక్ష్మయ్య, వెంకటమ్మ, కవిత(24), అనిల్ (34) మనవడు యువాన్ష్ (2)లతో రాత్రి భోజనం చేసి పడుకున్నారు. వెంకటమ్మతో కలిసి పనిచేస్తున్న పక్కనే ఉన్న మరో మహిళ ఉదయం డ్యూటికి వెళ్లే క్రమంలో వెంకటమ్మ వద్దకు వచ్చింది. ఎంత పిలిచిన వెంకటమ్మ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టపక్కల వారి సహయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఐదుగురు విగతాజీవులుగా పడిఉన్నారు. ఆంబులెన్స్‌కు సమాచారం అందించిన అందుబాటులో కేకపోవడంతో వారిని స్థానికులు పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెందారు.
వెంటనే పోలిసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కొండాపూర్ ఏరియా హస్పిటల్‌కు తరలించి అక్కడి నుండి గాంధీ హస్పిటల్‌కు తరలించారు. రాత్రి భోజనంలో వారు ఏదైన విషం కలుపుకొని తిన్నారా..? లేదా ఎవరైన వారికి తెలియకుండా భోజనంలో విషం కలిపారా..? అనే కోణంలో పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మయ్య, వెంకటమ్మ చిన్న కుమారుడు భగవత్ స్నేహితులతో కలిసి ముందురోజే వైజాగ్‌లో స్నేహితుడి వివాహం కోసం వెళ్లాడు.