నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎంవీఐ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వాహనానికి సంబంధించి చెక్‌లిస్ట్‌లో క్లియరెన్స్ కోసం ఎంవీఐ గుర్రం వివేకానంద రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఎసిబి డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం 16 మందితో కూడిన బృందం ఆర్మూర్ ఎంవిఐ కార్యాలయం చుట్టుపక్కల నిఘా ఉంచారు. ఫైళ్లు పెండింగ్ ఉన్న సదరు వ్యక్తి ఎం వి ఐ అధికారి అసిస్టెంట్. తిరుపతి వాహనం యజమానికి 25వేలు అందించాడు. అధికారి అసిస్టెంట్ ఎంవీఐకి లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గతంలో ఏవైనా అవకతవకలు జరిగాయని పరిశీలించిన తర్వాత ఎంవిఐ అధికారి ఇంట్లో, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అధికారుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఎసిబి వలలో ఆర్మూర్ ఎంవిఐ
- Advertisement -
- Advertisement -
- Advertisement -