Thursday, August 21, 2025

సచివాలయాన్ని తలపించేలా మున్సిపల్ భవనం నిర్మిస్తాం: బీర్ల అయిలయ్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదగిరిగుట్ట ః యాదగిరిగుట్ట మున్సిపాలిటీతో పాటు ఆలేరు అభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మున్సిపల్ నూతన కార్యాలయం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్ట పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో స్థానికులకు, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి సౌకర్యం కల్పించే విధంగా అభివృద్ధి పనులు చేపడతానన్నారు. గ్రామపంచాయతీ ఏర్పడినప్పుడు నిర్మాణం చేసిన భవనం శిథిలావస్థకు చేరడంతో తొలగించడం జరిగిందని, అదే స్థలంలో నూతన మున్సిపల్ భవనం రూ.3 కోట్ల 20 లక్షలతో అన్ని సౌకర్యాలతో సచివాలయాన్ని తలపించేలా మున్సిపల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.

కొత్త భవన నిర్మాణం ఆరు మాసాలలో పూర్తయ్యేలా చూస్తానని, పార్టీలకతీతంగా నూతన మున్సిపల్ భవనంలో తాజా, మాజీ కౌన్సిలర్లు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్లు, నీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్, మాజీ కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణీ భరత్, బబ్బూరి మౌనిక శ్రీధర్, గౌళీకార్ అరుణరాజేష్, ముక్కెర్ల మల్లేష్, సీస విజయలక్ష్మి కృష్ణ, ఆవుల మమత సాయి, దండెబోయిన అనిల్, మాజీ కోఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News