Thursday, August 21, 2025

పది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ / ఎల్లారెడ్డిపేట: కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని మోడి కానుకగా గురువారం బండ లింగంపల్లి పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మండల విద్యాధికారి క్రిష్ణహరి బిజెపి అధ్యక్షులు రేపాక రామ చంద్రా రెడ్డితో కలసి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ రోడ్డుపై విద్యార్థులు సైకిళ్లు రైడ్ చేస్తున్నప్పుడు ప్రమాధాలు జరుగ కుండ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పది వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన కోసమే ఎంపి బండి సంజయ్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.

అదనపు తరగతుల నిర్వహణ, స్టడీ పీరియడ్‌ల కోసం పైకిళ్లు ఎంతగానో ఉపయోగ పడుతాయని అన్నారు. మండలంలోని 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 406 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నట్లు పేర్కోన్నారు. గొల్లపల్లి, అల్మాస్‌పూర్, తిమ్మాపూర్, బొప్పాపూర్, దుమాల విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు వివరించారు. పది విద్యార్థులందరికి సైకిళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉచిత పుస్తకాలు, దుస్తులు, నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం,గుణాత్మకమైన బోధన వంటి మౌళిక సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేరి లక్షాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసి కార్యవర్గ సభ్యులు, బిజెపి నాయకులు ,కార్యకర్తలు, తల్లితండ్రులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News