Friday, August 22, 2025

ఒక్క నెలలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. 77 మందికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం: నిజామాబాద్‌లో మందు బాబులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. గత నెలలో జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గతంకంటే ఎక్కువగా ఉంటుందని ఇటీవల నమోదైన కేసులే చెబుతున్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో గత జూలై నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దాదాపు 1708 నమోదు అయినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 1708లో 966 మంది నిందితులపై అభియోగాలు మోపుతూ ఛార్జీ షీట్‌లు న్యాయ స్థానాలలో వేయగా 966 మంది కేసులలో నిందితులు నేరాన్ని ఒప్పుకొనగా, ఇందులో(77) కేసులలో జైలు శిక్షలు విధించగా మిగతా కేసులలో జరిమానాలు విధించినట్లు తెలిపారు. తర్వాత ఆ వాహనము నడిపిన డ్రైవర్, రైడర్ యొక్క డ్రైవింగ్ లైసెన్ను సస్పెండ్ చేయమని ఆర్‌టిఎ అధికారులను కోరగా గత జూలై నెలలో మొత్తం 62 డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు తెలిపారు. ఎవ్వరైనా మద్యం సేవించిన తర్వాత మీరు వాహనాలను నడపరాదని, వాహనాలను ఎవరికి ఇవ్వరాదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News