హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. జిహెచ్‌ఎంసి పరిధిలో భూకేటాయింపుల్ని రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఎంపిలు, ఎంఎల్‌ఎలు, జర్నలిస్టు తదితర సొసైటీల తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రా సహా మొత్తం 8 మంది వాదించారు. 2008లో కేటాయింపులు జరిపి నిర్మాణాలు కూడా చేపట్టారని ఇప్పుడు వేరే చోటుకు వెళ్లలేరంటూ వాదిం చారు. కరుణ, దయతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగ స్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనాన్ని కోరారు. రూ.8 నుంచి 30 వేల జీతాలుండే జర్నలిస్టుల్ని రూ.2.5 లక్షలు (జీతాలు, అలవెన్సులు) పొందే ఎంపిలు, ఎంఎల్‌ఎలులు, ఐఎఎస్‌లతో సమానంగా చూస్తున్నారని వాదించారు. జర్నలిస్టులది ప్రత్యేక తరగతి అని, ప్రజాస్వామ్య నాలుగో స్తంభంగా పనిచేస్తారని కోర్టుకు విన్నవించారు.
హౌసింగ్ సొసైటీలకు మరోసారి చుక్కెదురు
- Advertisement -
- Advertisement -
- Advertisement -