Friday, August 22, 2025

నిరుద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ శాఖలో 217 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ పోస్టులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కొత్తగా ఏర్పాటు చేసిన 15 రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులు, అలాగే రెండు డివిజన్ల కోసం మరో 28 పోస్టులు మంజూరు చేస్తూ గురువారం జీఓ విడుదల చేసింది. గద్వాల, నల్గొండ, వికారాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అతి త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News